రాపూరు అటవీ ప్రాంతంలో అదృశ్యమైన కిషోర్ మృతి మృతదేహం వెలికితీసిన పోలీసులు..
రాపూరు – చిట్వేల్ ఘాట్ రోడ్డులో సిద్దలేశ్వర కోన జలపాతం చూసేందుకు వెళ్లిన ఐదుగురిలో కిషోర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు , అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలయ చేపట్టారు.జలాశయానికి సమీపంలో కిషోర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.పూటుగా మద్యం సేవించి గుంటలో పడిపోయాడని పోలీసులు తెలిపారు.రాపూరు ఎస్సై క్రాంతి కుమార్ సిబ్బంది శ్రమించి కిషోర్ మృతదేహాన్ని నీటి నుండి బయటకు తీసి రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రిపోర్టర్ కార్తీక్ రెడ్డి ప్రజా నేత్ర రిపోర్టర్ -రాపూరు మండలం నెల్లూరు జిల్లా