యుటిఎఫ్ కర్నూల్ జిల్లా 16 వ మహాసభలు జయప్రదం చేయండి- యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ

ప్యాపిలి డిసెంబర్ 08 (ప్రజా  నేత్ర న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) కర్నూల్ జిల్లా 16 వ మహాసభలు డిశంబరు 11,12 తేదీలలో ఆదోని పట్టణంలో జరగనున్నాయని ఈ సమావేశాలు జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శాంతిప్రియ పిలుపునిచ్చారు.ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహాసభల కరపత్రాల విడుదల అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 11 మరియు 12 తేదీలలో మహాసభలు జరుగుతాయని మొదటి రోజు సదస్సు ఉంటుందని దీనికి యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు వస్తున్నారని రెండవ రోజు సమావేశంలో కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని,ఈ సమావేశాలలో నూతన కర్తవ్యాలను,భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడం జరుగుతుందని తెలిపారు.కావున పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల,సుజాత,సుజాతమ్మ,విజయ,జయ లక్ష్మి,ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.