మల్లికార్జున స్వామి పుట్టమన్ను కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

మల్లికార్జున స్వామి పుట్టమన్ను కు వెళ్లే వారి సౌకర్యార్థం రామగుండం నగరపాలక సంస్థ పరిధి అడ్డగుంట పల్లి పుట్ట మల్లికార్జున స్వామి స్థలంలో పిచ్చి మొక్కలు బాగా పెరిగి అస్తవ్యస్తంగా ప్రజలు నడవడానికి ఇబ్బందిగా ఉండటంతో ప్రజలు అభివృద్ధి కమిటీ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .అభివృద్ధి కమిటీ సభ్యులు మల్లికార్జున స్వామి పుట్ట మన్ను కు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా పిచ్చి మొక్కలు తొలగించి ఆలయ ప్రాంగణానికి సున్నం పెయింటింగ్ వేయించారు. రాబోయే కాలంలో పుట్ట మల్లికార్జున స్వామి గుడి అభివృద్ధి చేయాలని అడ్డగుంట పల్లి అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో అడ్డగుంట పల్లి అభివృద్ధి కమిటీ నాయకులు ,సభ్యులు పాల్గొన్నారు. ప్రజానేత న్యూస్ రిపోర్టర్ సతీష్ రామగుండం పెద్దపల్లి జిల్లా

Leave A Reply

Your email address will not be published.