బీసీ గణన చేపట్టాలంటూ పార్లమెంటు ముట్టడికి యత్నించిన బీసీ నాయకులు అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు…తీవ్ర తోపులాట

జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెంటు ముట్టడికి యత్నించారు.మంగళవారం మధ్యాహ్నం జంతర్ మంతర్ నుండి ర్యాలీగా బయలుదేరిన బీసీ నాయకులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దాటుకుని పార్లమెంటు వైపు వెళ్ళటానికి యత్నించిన నాయకులను అదనపు బలగాలతో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి శశికుమార్ మాట్లాడుతూ జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తుంటే కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోగా ఇలా కేంద్ర బలగాలతో అడ్డుకోవటం చాలా దుర్మార్గమన్నారు.కేంద్ర ప్రభుత్వం స్పందించని కారణంగానే నేడు పార్లమెంటు ముట్టడి చేపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ గణనపై నిర్ణయం తీసుకోవాలని, ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేనిపక్షంలో బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇదే బీసీ వ్యతిరేక విధానాలతో వవహరిస్తే బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి కడతారన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దివాకర్ గౌడ్, మణి మంజరి, మధులత, బాలరాజు గౌడ్, అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్, మహీందర్ నాయుడు,శేఖర్ గౌడ్, చింతపల్లి సతీష్,వీరమల్ల కార్తిక్, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ బ్యూరో శేఖర్

Leave A Reply

Your email address will not be published.