ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అరికట్టాలి.

జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 2 ; ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలుస్తుందని ఇకనుండి జిల్లాలో ఒక సెంటు భూమిలో కూడా అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అందుకు మండల స్థాయిలో ఎంపీడీవో, తాసిల్దార్, ఎంపిఓ,సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ల తో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మీరంతా యాక్టివ్ గా ఉండి ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాంటి నిర్మాణాలు జరుగుతున్నట్టు మీ దృష్టికి వస్తే వెంటనే కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందించి ఆలస్యం చేయకుండా పోలీస్ శాఖ వారి సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని నిర్మాణాలను ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్. దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్ కుమార్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.