ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా నేత్ర న్యూస్ ; ఏ ఐ ఎస్ ఎఫ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది, బుధవారం నాడు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఏఐఎస్ఎఫ్ బృందం కలిసి నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థుల మీద కపట ప్రేమ చూపిస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ఉద్దేశంతోనే ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యలకు కొమ్ము కాస్తూ పేద విద్యార్థుల జీవితాలతో తెలంగాణ మారుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బాలా గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు, పేద తరగతి మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్నారు, ఉదయం 8, గంటలకు పల్లెటూర్లకు ఒకేసారి ఉండడంవల్ల విద్యార్థుల ఇంటివద్ద భోజనాలు కాకపోవడం గమనార్హం, ఉదయం కాలేజీకి వెళ్తే తిరిగి సాయంత్రం రావాల్సి ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకనే పేద విద్యార్థులు మధ్యలోనే చదువు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య నిర్బంధ విద్య అమలు చేస్తామని అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఏళ్ళు గడిచినా విడుదల చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు,పేద విద్యార్థులు చదువుకొని ప్రభుత్వ స్కూళ్లను గాని ప్రభుత్వ కాలేజీలో గాని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ గాని మూసివేయడం చాలా బాధాకరమని పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచన దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆలోచిస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ అన్నారు, పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని విద్యార్థులతో కలుపుకొని అనేక రూపాల్లో ఆందోళనలు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం,ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మారేడు శివ శంకర్, దేశమని ఆంజనేయులు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.