ప్రతిరోజు స్పందనలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

కృష్ణాజిల్లా మచిలీపట్నం

ప్రజలు తెలుపుకునే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి.

ప్రతిరోజు స్పందనలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసి, వారి సమస్యకు పరిష్కారం పొందవచ్చని, ప్రతిరోజు వారితో మాట్లాడేందుకు వీలుగా ప్రతిరోజు స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అన్నారు. ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో ప్రజలు వారి యొక్క సమస్యలను ఎస్పి గారికి నేరుగా విన్నవించుకున్నారు.ఈ రోజు ప్రతి రోజు స్పందన లో భాగంగా వివిధ రకాల సమస్యలతో బాధపడే ప్రజలు వారి సమస్యలను ఫిర్యాదు రూపంలో ఎస్పి గారికి తెలియజేయగా, ఎస్పీ గారు ఆ ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించి చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈరోజు అందిన ఫిర్యాదుల లో

1. నందిగామ నుండి ఒక మహిళ వచ్చి తన భర్త సంవత్సరం క్రితం కోవిడ్ కారణంగా మరణించాడని, అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కి 10 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చామని ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని, న్యాయం చేయమని ఎస్పీ గారిని కోరగా ఆ ఫిర్యాదును నందిగామ డిఎస్పీ గారికి బదిలీ చేసి చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కారం చూపాల్సిందిగా తెలిపారు.

2. మోపిదేవి నుండి ఒక మహిళ వచ్చి వారి భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కోర్టులో కేసు నడుస్తోందని, అయినప్పటికీ అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఎస్పీ గారిని కోరగా ఆ ఫిర్యాదును అవనిగడ్డ ఎస్సై గారికి బదిలీ చేయడం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.