ప్రజాస్వామ్యం పద్దతిలో రజక సంఘం డివిజన్ కమిటీలు, ఖమ్మం నగర రజక సంఘం కన్వీనర్ కణతాల నరసింహారావు

ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజాస్వామ్య పద్దతిలో 60 డివిజన్ ల రజక సంఘం కమిటీలు వేస్తామని రజక సంఘం ఖమ్మం నగర కన్వీనర్ గా నియమితులైన కణతాల నరసింహారావు తెలియజేసారు . మంగళవారం బురహానపురం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు . రజకులలో ఐక్యత తీసుకురావడం కోసం రజక సంఘం కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు . తనపై నమ్మకం ఉంచి కన్వీనర్ బాద్యతలు అప్పగించినందుకు రజక సంఘం పెద్దలు జక్కుల లక్ష్మయ్య , పంతంగి వెంకటేశ్వర్లు , రేగళ్ల సీతారాములు ఆయన ధన్యవాదాలు తెలిపారు . ఈ ప్రెస్ మీట్ లో నాయకులు జక్కుల వెంకటరమణ , గూడెపు నాగరాజులు మాట్లాడుతూ రజక వనబోజనాల కార్యక్రమంకు ఆర్థిక సహకారం అందించిన రజక కుల బంధువులకు ధన్యవాదాలు తెలిపారు . రాబోయే రోజులలో జిల్లాలో రజక కులస్తులకు ఏదైనా సమస్యలు ఉత్పన్నమయితే వాటి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు . ఈ పాత్రికేయుల సమావేశంలో పగిళ్ళ బుచ్చిబాబు , రామారావు , రేగళ్ల లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ.

Leave A Reply

Your email address will not be published.