చెరువులు, కాలువల మరమ్మతు లకు చర్యలు చేపట్టాలి..

జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 2 ; అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, పంట కాల్వల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అధిక వర్షాలతో దెబ్బతిన్న రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని గరిమళ్ళకుంట చెరువును, భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి దోమర్లమల్ల చెరువు కెనాల్ ను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల రైతులు అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువు, కాలువల మూలంగా సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరగ స్పందించిన జిల్లా కలెక్టర్ అధిక వర్షాలతో దెబ్బతిన్న చెరువులు పంట కాలువల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులతో సేకరించడం జరిగిందని త్వరలోనే వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని రైతులకు తెలియజేశారు. అలాగే మరమ్మత్తులకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ ఇఇ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.