గంపలగూడెం మండలంలో వివిధ గ్రామాల లో మిర్చి తోటలను పరిశీలించిన కౌలు రైతు సంఘం

ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఆధ్వర్యంలో ఈరోజు గంపలగూడెం మండలంలో  వివిధ గ్రామాల లో మిర్చి తోటలను పరిశీలించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో దాదాపు  9, 350 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయడం జరిగింది. ఈ ఏడాది వర్షాలు సమతుల్యంగా ఉన్నప్పటికీ పంటలకు నల్ల నల్లి తో మిర్చి పంట కుసించుకుపోయింది. అనేక రకాల మందులు పిచికారి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనితో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిర్చి పంటకు ప్రభుత్వమే భీమా చెల్లించిఉన్నది.ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రైతులకు పంట నష్టం తో పాటు భీమాను కూడా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతు సంఘం కోరింది. ఈ విషయమై స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు వ్రాతపూర్వకంగా విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘాం జిల్లా అధ్యక్షుడు గూవ్వల శీతారామీరెడ్డి,రైతుసంఘం మండల కార్యదర్శి G.వీరభద్రం,M.వెంకటరెడ్డి,CITU మండల కార్యదర్శి J.వెంకటశ్వరావూ,M.గోపి,N.సత్యంబాబు,కోట.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.