ఖమ్మం రోటరీక్లబ్ , ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ పాదములు వీల్చైర్ పంపిణీ

ఖమ్మం : ఎన్ఎస్పీ రోడ్డు రోటరీ ఆర్టిఫిషియల్ లింబై సెంటర్ లో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం రోటరీక్లబ్ , ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు కృత్రిమ పాదములు , వీల్చైర్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నారై ఫౌండేషన్ అమెరికా దొడ్డపనేని హరినాథ్ పాల్గొని ఇరవై అయిదు మందికి ఉచితంగా కృత్రిమ పాదములు , వీల్ఛైర్లను పంపిణీ చేసి లక్ష రూపాయల చెక్కును అందజేశారు . అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఇరవై అయిదు మందికి ఉచితంగా కృత్రిమ పాదములు ( ఆర్ట్ఫిషల్ లిమ్స్ ) స్పాన్సర్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ ఏ) రవి – శైలజ డేశ్ రాజ్ దంపతులు అని వారి సహాయ సహకారాలతో అందజేశామని తెలిపారు . ఈ సందర్బంగా ఖమ్మం రోటరీక్లబ్ , ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ దొడ్డపనేని హరినాథ్ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ప్రాంతవాసి అని ఈ మధ్య కాలంలో అమెరికాకు వెళ్లి సెటిల్ అయ్యారని ఖమ్మం జిల్లాకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ముందుకు వచ్చి తమ వంతు సాయాన్ని కుడా అందించారు . జీవితంలో ఎంతో కష్టపడి పరమపద సోపానంలో ఉన్నత స్థితికి చేరుకున్న ఆయన జీవితం మనకు ఆదర్శం అని ఎన్నో సేవా కార్యక్రమములు నిస్వార్థంగా నిర్వహిస్తూ , రోటరీ క్లబ్ ఖమ్మంకు చేయూత నిచ్చి ఆదర్శంగా నిలవటం మాకు సంతోషాన్ని , బలాన్ని చేకూర్చిందని వారికి వారి కుటుంబ సభ్యులకు సర్వదా సదా మేలు జరగాలని ఆకాంక్షించారు . రోటరీ ట్రస్టు చైర్మన్ మల్లాది వాసుదేవ్ , రోటరీ ట్రస్టు కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , రోటరీ క్లబ్ ఖమ్మం జిల్లా ప్రసిడెంట్ పాలడుగు నాగేశ్వరరావు , క్లబ్ సెక్రటరీ నల్లమోతు రవీంద్రనాథ్ , డిఎన్ఎఫ్ చైర్మెన్ బోనాల రామకృష్ణ , డిఎన్ఎఫ్ సెక్రటరీ ఆర్ టీఎన్ నాగేశ్వరరావు , డిఎన్ఎఫ్ కో-ఆర్డినేటర్ పసుమర్తి రంగారావు , రోటరీ ట్రస్టు మెంబర్ బెల్లంకొండ బాబాజీ ఇతర రోటరీ సభ్యులు , డిఎన్ఎఫ్ సభ్యులు కలిసి వచ్చిన ముఖ్య అతిధికి శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు .ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.