ఊరుకొండ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల తీర్మానం

ఊరుకొండ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల తీర్మానం..శ్రీయుత గౌరవనీయులైన ఊరుకొండ మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, పత్రిక అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా..ఊరుకొండ మండలంలో ఎక్కడ అయినా సరే అధికార, అనధికార కార్యక్రమాలు, సమావేశాలు, పత్రిక ప్రకటనలు ఏవైనా “ఊరుకొండ ప్రెస్ క్లబ్” వాట్సాప్ గ్రూప్ లో పంపడంతో పాటు ఫోన్ ల ద్వారా సమాచారం ఇవ్వగలరు. లేనిపక్షంలో వార్తలు రాయ బడవు. ఇట్టి విషయాన్ని అందరు గమనించగలరు.

ముఖ్య గమనిక :
ఊరుకొండ మండల జర్నలిస్టులను అవమానపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించే ప్రసక్తి లేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులను కించ పరిచినట్లు, అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారని మండల ప్రెస్ క్లబ్ దృష్టికి వచ్చింది. ఇకమీదట ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం అయితే అట్టి వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని తీర్మానం చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరని కోరుతున్నాము.

Leave A Reply

Your email address will not be published.