ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రజా నేత్ర న్యూస్ ఆదిలాబాద్ తేదీ:26-11-2021 ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండకర్ల కమలాకర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం కరపత్రాలను ఆవిష్కరించారు. కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక కరపత్రాలు విడుదల చేశారు. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో సందీప్,తిరుపతి ల ఆధ్వర్యంలో విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. సిర్పూర్ (టీ) మండల కేంద్రంలో కబీర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కౌటాల మండలం పార్టీ గ్రామంలో విలాస్, రాజు గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆర్టికల్ 51(ఏ) ప్రాథమిక విధులు పోస్టర్లను విడుదల చేశారు. లింగాపూర్ మండలం లో విజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో గుగ్గిళ్ళ స్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.వాంకిడి మండలం కనర్గాము గ్రామంలో ప్రవీణ్ ఆధ్వర్యంలో పాఠశాల యందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ని సంతోష్, ఈరాజేందర్, తబ్రేజ్ ఖాన్, భాస్కర్, రాహుల్, సికిందర్ లతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.