స్పీయం(జెకె పేపర్) యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలి: డా.పాల్వాయి

కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో :ఈ రోజు ఎస్పీయం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగా మిల్లులో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. హైదరాబాద్ కు తరలించే క్రమంలో అందెవెళ్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టు కార్మికుడు మోహన్ రావు మరణించడం జరిగింది.మోహన్ రావు కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ కు వస్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డగించడం జరిగింది. విషయం తెలుసుకున్న డా.పాల్వాయి హరీష్ బాబు భట్పల్లి గ్రామం ప్రధాన రహదారిపై ఉన్న మోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పై బైటాయించడం జరిగింది.మృతుని కుటుంబం లో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు ఎస్పీయం యాజమాన్యం తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తో ధర్నా ను వాయిదా వేయడం జరిగింది.తరచు ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం “మౌత్ కా సౌదాగర్”(Merchant of death) గా వ్యవహరించడం దారుణమన్నారు.

Leave A Reply

Your email address will not be published.