సిరికొండ నూతన కాంగ్రెస్ మండల కమిటీ ఎన్నిక

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల నూతన కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైనమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షేక్.ఇమామ్,సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెందూర్ అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీగా బొడ్డు నవీన్ లకు నియామక పత్రాన్ని అందించారు. నూతనంగా నియామకమైన మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతుగా ఎల్లవేళల కృషి చేస్తామని బాధ్యతగా, సమన్వయంతో అందరినీ కలుపుకు పోతామాని చెప్పడం జరిగింది. అలాగే సిరికొండ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సిరికొండ మండల మైనారిటీ చైర్మన్MD. రంజాన్, మాధవ్ పటేల్,సాజిత్,అలం,మైముద్, గంగన్న, రమేష్, షబ్బీర్, భీంరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.