సింగరేణి భూసేకరణ వేగవంతం చేయాలి.

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 8 సింగరేణి భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సింగరేణి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సింగరేణి సంస్థ కార్యకలాపాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టిందని జిల్లాలో సింగరేణి సంస్థ అవసరమైన భూసేకరణకు ప్రభుత్వ యంత్రాంగం ముందు నుండి సహకారం అందిస్తుందని పెండింగ్లో ఉన్న భూసేకరణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి విద్యుత్ ను అందించడానికి, పరిశ్రమలను నడపడానికి బొగ్గును సరఫరా చేయడంలో సింగరేణి సంస్థ ప్రముఖ పాత్ర వహిస్తుందని జిల్లాలో కేటీకేఓసి-2, కేటీకే ఓసి-3 ల విస్తరణ కొరకు అవసరమైన పెండింగ్లో ఉన్న భూసేకరణపై ప్రధానంగా దృష్టి పెట్టామని త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా సింగరేణి భూముల సంరక్షణకు సింగరేణి సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎం శ్రీనివాసరావు, ఎస్ఓ టు డైరెక్టర్ రవి ప్రసాద్, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బాబుల్ రాజ్, కేటీకే ఓసి-3 ప్రాజెక్ట్ మేనేజర్ రాజగోపాల్, ఎస్టేట్ మేనేజర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.