సఖి ఆధ్వర్యంలో మండల స్థాయి న్యాయ విజ్ఞాన సదస్సు

ప్రజానేత్ర న్యూస్, రెబ్బెన , తేదీ:15.11.2021 ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని kGBV స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ సఖి కేంద్ర సబ్యులు మౌనిక ,మమత, హారిక విద్యార్థులతో అన్నారు. నిరుపేదలకు అభాగ్యులకు, మహిళలకు, పిల్లలకు మరియు సంవత్సర ఆదాయం 3,00,000 మించని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నారని తెలిపారు. సఖి సర్వీసెస్ గురించి,మహిళ హెల్ప్లైన్ 181 గురించి ,సైబర్ నేరాల గురించి ,బాల కార్మిక నిరోధక చట్టాలు, మహిళ సంరక్షణ చట్టాలు,బాల్య వివాహ చట్టాలు మరియు సమాచార హక్కు చట్టాల గురించి న్యాయ సహాయం ఎలా పొందాలి అని, మరియు ఉచిత న్యాయ సహాయం కోసం మండల న్యాయ సేవ సంస్థ ని ఎలా సంప్రదించాలి అని వివరించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.