శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్న డీకే అరుణ

గద్వాల: ఫిబ్రవరి, 2022 ప్రజానేత న్యూస్; శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాట్లపై శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో గల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం నందు బుధవారం నిర్వహించిన సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ పాల్గొని చిన్న జీయర్ స్వామి ని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథులుగా వస్తున్నారని వీరితో పాటు దేశంలోని సాధుపుంగవులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణ కు కూడా స్వామిజీ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం కృష్ణారెడ్డి బీజేపీ నాయకులు బండారు వెంకట్రాములు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.