వైసిపి ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

స్థానిక మండల జడ్పిటిసి అభ్యర్థి భీమిరెడ్డి లోకేశ్వర రెడ్డి కొండపర్వ, తాత కుంట్ల గ్రామాలలో ఉదయం పూట ప్రచారం నిర్వహించారు. తొలుత ఉదయం సమయంలో కొండ పర్వ మల్లయ్య స్వామి గట్టు వద్ద ప్రత్యేక పూజలను చర్చిలో ప్రార్థన లను నిర్వహించిన అనంతరం తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. తిరువూరు నియోజకవర్గానికి విసన్నపేట మండలానికి ఈశాన్య దిక్కు న ఉన్న దళితవాడ నుండి వైసీపీకి మద్దతు తెలుపమని ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ పర్వ గ్రామ సర్పంచ్ జీ రమేష్, సహకార సంఘ అధ్యక్షులు, చంద్రశేఖర్, ఎంపీపీ పీఎం వనజాక్షి, వైస్ ఎంపీపీ గాజుల శ్రీనివాసరావు, జిల్లా డైరెక్టర్ బి రాణి, పార్టీ సీనియర్ నాయకులు పాపారావు, మంగయ్య పాల్గొన్నారు.
తాత కుంట గ్రామంలో జరిగిన జడ్పిటిసి ప్రచార కార్యక్రమంలో ఇంజనీర్ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి పొద్దుటూరు వెంకటేశ్వరరావు, మేడ మల్లయ్య, ఎంపీటీసీ మేడ తిరుపతిరావు,కట్ట ప్రసాద్, దార్ల వినోద్, కాలిషా, పాపారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.