విద్యా ప్రదాత ఆజాద్ – యుటిఎఫ్

ప్యాపిలి నవంబర్ 11 ( ప్రజా  నేత్ర న్యూస్) : భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి,స్వాతంత్య్ర సమరయోధుడు,గొప్ప విద్యా వేత్త మరియు కవి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి అధ్యక్షతన హుస్సేనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలే రేపటి భావిభారత పౌరులను తయారు చేసే ప్రయోగశాలలు అని మౌలానా నమ్మేవారని,ఆయన యొక్క దేశభక్తి జాతీయత భారత జాతీయ ముస్లిం లీగ్ యొక్క వేర్పాటు సిద్ధాంతాన్ని వ్యతిరేకించిందని ఆయన నడిపిన అల్ హిలాల్ పత్రికలో బ్రిటీషు సామ్రాజ్య వాదాన్ని చీల్చి చెండాడారని అన్నారు.అనంతరం ఆజాద్ చిత్ర పటానికి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చంద్ర మౌళి పూల మాల వేసి నివాళులర్పించారు.అధ్యక్షులు మాట్లాడుతూ విభజించు పాలించు అనే రాజనీతిని అమలు చేసిన బ్రిటీషు పాలకులు విభిన్న మతాలు జాతులు తెగలు ఉన్న భారతదేశం విద్యా పరంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందితే పరిపాలన సహించదు అనే ఆలోచనతో తమ సొంత లక్ష్యాలు సాధించే లాభాలను ఆర్జించే కింది స్థాయి ఉద్యోగులను తయారుచేసే ప్రణాళికతో విద్యా విధానాన్ని రూపొందించారని అన్నారు. జిల్లా కౌన్సిలర్ అంజనప్ప మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు విద్యా రంగ సంస్కరణల పేరిట జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకొని వచ్చి విద్యా రంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీంద్రా నాయక్,పద్మావతి,లక్ష్మి,శాంతమ్మ,లక్ష్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.