విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం,శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి – జనవిజ్ఞాన వేదిక

ప్యాపిలి నవంబర్ 10 (ప్రజానేత్ర న్యూస్): విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి,శాస్త్రీయ విజ్ఞానం,శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం శెట్టి అన్నారు.ప్యాపిలి లోని స్థానిక పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో మూఢ నమ్మకాలు నిర్మూలన చేయాలి అన్నారు.ప్రతీ ఒక్కరూ శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలని అన్నారు.అనంతరం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రికలు విడుదల చేశారు.నవంబర్ 11 వ తేదీన పాఠశాల స్థాయిలో పరీక్ష ఉంటుందని తెలిపారు,పరీక్ష ఫీజు 10 రూపాయలు ఉంటుందని తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మాధ్యమాలలో ప్రశ్నాపత్రం ఉంటుందని పేర్కొన్నారు.8,9,10 తరగతుల విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని,మూడు తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి నవంబర్ 18 వ తేదీన మండల స్థాయిలో పరీక్ష ఉంటుందని తెలిపారు.ఈ అవకాశాన్ని అన్ని పాఠశాలల విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.డోన్ డివిజన్ లోని ప్యాపిలి మరియు డోన్ మండలాల పరిధిలో దాదాపుగా 1500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు నరసింహారెడ్డి,సర్వజ్ఞ మూర్తి,బాబు,లతీఫ్,సుబ్బరాయుడు,సుబ్బారెడ్డి,వెంకటేశ్వర్లు,హుసేన్ బాషా,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.