ముగిసిన పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు

ప్యాపిలి నవంబర్ 11 (ప్రజానేత్ర న్యూస్) : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు ప్యాపిలి మండల వ్యాప్తంగా 10 ఉన్నత పాఠశాలల్లో నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షలలో మండలంలో 800 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని జనవిజ్ఞాన వేదిక డోన్ డివిజన్ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి,యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు.
వారు మాట్లాడుతూ ప్రగతి కోసం సైన్స్,స్వావలంబన కోసం సైన్స్ అనే మౌలిక అంశాలతో జనవిజ్ఞాన వేదిక ఏర్పడింది అన్నారు.ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు నిర్మూలన చేసి సృజనాత్మక శక్తిని పెంపొందించడం దీని ఉద్దేశం అన్నారు.అదే విధంగా విద్యార్థుల్లో అవగాహన శక్తిని,సృజనాత్మక శక్తిని,శాస్త్రీయదృక్పథం,శాస్త్రీయ అవగాహన,శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాలని ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. మండల పరిధిలోని హుసేనాపురం,రాచర్ల,బూరుగల,పి ఆర్ పల్లి,చిన్న పోదిళ్ల,ఏనుగు మర్రి,ప్యాపిలి జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలు,ప్యాపిలి కే జి బి వి,ప్యాపిలి శిశు మందిరం పాఠశాలల్లో చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ పరీక్షలలో తరగతుల వారీగా మొదటి,ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులు నవంబర్ 18 వ తేదీన మండల స్థాయిలో ప్యాపిలిలో నిర్వహించే పోటీలకు హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,మండల గౌరవాధ్యక్షులు లక్ష్మి నాయక్,ఆర్థిక కార్యదర్శి మోహన్,కృష్ణ కుమార్,సురేష్ బాబు ,కంబగిరి,రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.