బోయించెర్వుపల్లి ,లక్ష్మీతండా పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవం

ప్యాపిలి నవంబర్ 13 (ప్రజానేత్ర న్యూస్) :

పాఠశాల విద్యార్థులకు బోయించెర్వుపల్లి సర్పంచ్ 15000 విరాళంతో బాలల దినోత్సవ కానుకలు

బోయించెర్వుపల్లి, లక్ష్మీతండా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తాం:సర్పంచ్ కొత్తూరు రాముడు

ప్యాపిలి మండలంలోని బోయించెర్వుపల్లి లక్ష్మితండా గ్రామాల పాఠశాలల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర రెడ్డి మరియు మహేశ్వరి గార్ల అధ్యక్షతన సర్పంచ్ కొత్తూరు రాముడు గారి 15000/- రూ..ఆర్థిక సహకారంతో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దాతలు గ్రామ సర్పంచ్ కొత్తూరు రాముడు మరియు కంబగిరి స్వామి మరియు రాచెర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,
సాహితీవేత్త సురేష్ బాబు గారు గ్రామ పెద్దలు శేషయ్య మరియు వెంకటేశ్వర్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం యస్ టి యు ప్యాపిలి మండల అధ్యక్షులు చిన్నప రెడ్డి లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తూరు రాముడు గారు మరియు సాహితీవేత్త సురేష్ బాబు గారు నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం బోయించెర్వుపల్లి ,లక్ష్మీ తండా పాఠశాలల విద్యార్థులకు (75 మంది కి )ప్రతి ఒక్కరికి ఒక ప్లేట్ మరియు టిఫిన్ బాక్స్ లను సర్పంచ్ గారు బహుకరించారు. తర్వాత విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని సర్పంచ్ కొత్తూరు రాముడు గారు పేర్కొన్నారు. సాహితీవేత్త సురేష్ బాబు గారు విద్యార్థులకు చక్కని సందేశం ఇవ్వడమే గాక రాచెర్ల పిల్లలు రాసిన కథల పుస్తకాలను విద్యార్థులకు అందించారు.అదేవిదంగారాష్ట్రోపాధ్యాయ సంఘం యస్ టి యు ప్యాపిలి మండల అధ్యక్షులు చిన్నపరెడ్డిగారు గ్రామ సర్పంచ్ కొత్తూరు రాముడు గారి ఔదార్యాన్ని మెచ్చుకోవడం తో పాటు విద్యార్థులందరికీ ఉపయోగపడే బాల సాహిత్యం పుస్తకాలను చిన్నపరెడ్డి గారు అందించారు.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అనంతరం విద్యార్థులకు మిఠాయి లు పంచిపెట్టారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవేంద్ర రెడ్డి,మహేశ్వరి,జయలక్ష్మి, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
🎤 ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.