బట్టుపల్లి గ్రామవాసి కృష్ణకు గౌరవ డాక్టరేట్

ప్రజానేత్ర న్యూస్, కాగజ్నగర్, తేదీ:09-11-2021; కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి కృష్ణ కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే సామాజిక కార్యకర్తలకు ఇచ్చే గౌరవ డాక్టరేట్ ను కృష్ణ చేసిన సామాజిక సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం జరిగింది మరియు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నందు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు దీనిని సర్టిఫై చేశారు. కృష్ణ సామాజిక కార్యకర్తగా ఆర్టిఐ కార్యకర్తగా శిక్షకుడిగా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మరియు సోషల్ ఆడిట్ నందు రిసోర్స్ పర్సన్ గా కేంద్ర,రాష్ట్ర పథకాలు పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఎంతో కృషి చేశారు. ఇట్టి సామాజిక కార్యక్రమాలను గుర్తించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు గౌరవ డాక్టరేట్ తో కృష్ణ ను సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లేతనకు గుర్తింపు వచ్చిందన్నారు. గౌరవ డాక్టరేట్ తో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత తలపై పెరిగిందన్నారు. డాక్టరేట్ పొందిన కృష్ణను గ్రామస్తులు గ్రామ యువకులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.