నాడు ఎస్సై కావాలని ఆశయం – నేడు ప్రజల అభివృధ్ధికోసం ప్రజాప్రతినిధుడైన ఎంపిపి వై.రాజారెడ్డి

గద్వాల జిల్లా : మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన రామమ్మ, నాగిరెడ్డి పుణ్యదంపతులకు జన్మనొందిన వై.రాజారెడ్డి సాధారణ రైతు కుటుంబంలో పెరిగినా కానీ చిన్న వయసులోనుండే పేదప్రజల కష్టాన్ని దగ్గరుండి చూస్తూ ఉన్నత విద్యాభ్యాసం గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ కళాశాలలో డిగ్రీవరకు పూర్తిచేయడం జరిగింది. ఈ సమాజంలో పోలీస్ చట్టాలు కొంతమందికి చుట్టాలైనప్పుడు సామాన్య ప్రజలకు చట్టాలు జవాబుదారీగా ఉండాలనే సంకల్పంతో సబ్ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) కావాలనే లక్ష్యంతో ఇంటర్వ్యూలో అతితక్కువ మార్కులతో చేజారడంతో
అనుకూల పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ ఆశయానికి కొంత నిరాశకు గురిచేసింది.ఎలాగైనా ప్రజలకు దగ్గరుండి నా వంతుగా అభివృద్ధిపరంగా సహాయ సహకారాలు అందించాలన్నది రాజారెడ్డి లోని గొప్ప దృఢ సంకల్పం.తండ్రి చేపట్టిన వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే కష్టపడి చదివి డిగ్రీ పూర్తిచేయడం జరిగింది.నిరుపేద విద్యార్థులకు తనవంతుగా తనలాంటి ఆశయం గల నిరుపేద విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకుండగా తమ లక్ష్యం సాధించుటకు చదువుపరంగా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో,ఆశయంతో తనకున్నంతలో ఆర్థికంగా సహాయం చేసిన గొప్ప మానవతవాది చదువులతల్లి సావిత్రిబాయ్ పూలే వారసుడు పుత్రుడు మనసున్న ” మారాజు “ఎంపిపి వై.రాజారెడ్డి.అందుకే అంటారు రాజారెడ్డి కాదు మా రాజన్న అంటారు శ్రేయోభిలాసులు.
*ఏది ఏమైనప్పటికీ ఈ సమాజంలో ఎలాగైనా ప్రజలకు నా వంతుగా దగ్గరుండి సేవలందించాలనే తపనతో రాజకీయరంగంలో అడుగుపెట్టి ఎన్నికలలో మూడుసార్లు వరుసగా వార్డు మెంబర్ గా గెలుపొంది, ఉపసర్పంచ్ గా గెలుపొందడం జరిగింది.**అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకై విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ఉపసర్పంచ్ పదవి శాశ్వతం కాదు అమరవీర విద్యార్థుల బలిదానాల ముందు నా పదవి ఎంత అని గ్రహించుకొని తన ఉపసర్పంచ్ పదవికి తృణపాయంగా రాజీనామా చేసి ఉద్యమకారులో మరింత ఉత్సాహాన్ని నింపుతూ చైతన్యం చేసిన మహోన్నతమైన త్యాగశీలి వై.రాజారెడ్డి.నాసేవ కేవలం గ్రామీణ స్థాయిలోనే కాకుండా రైతు కుటుంబంలో జన్మించడం వల్ల రైతు బాధలను అర్థంచేసుకొని మండల స్థాయిలో రైతుల పరంగా అన్నిగ్రామాల రైతుల అభివృద్ది కోసం పనిచేయాలనే దృఢ సంకల్పంతో మండల స్థాయిలో సింగిల్ విండో మెంబర్ గా గెలుపొందడం జరిగింది.
కేవలం రైతుల పరంగానే సహాయపడడం కాకుండా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అభివృద్ధి పరంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో మల్దకల్ మండల గ్రామీణ ప్రజల ఆశీర్వాదంతో వైస్ ఎంపిపి గా ఎన్నికై తన వంతుగా అన్ని గ్రామాల ప్రజలకు సేవలందించి ప్రజల అభిమానాన్ని చాటుకుంటు రాజకీయ రంగంలో నిత్యం తిరుగులేని విజేతగా నిలుస్తూ ప్రస్తుతం మల్దకల్ మండల ఎంపిపి గా గెలుపొంది పదవి భాద్యతలు చేపట్టడం జరిగింది.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలే నా దేవుళ్ళు – ప్రజల క్షేమమే నా ముందున్న లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,సహకారంతో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అన్ని విధాలా చేరవేసేందుకు మండల స్థాయి ప్రజాప్రతినిధులను, అధికారులను కలుపుకొని ప్రజల బాగుకోసం పరితపించే నిత్యకృశీవలుడు ఎంపిపి వై.రాజారెడ్డి.అందుకే అంటారు రాజారెడ్డి కాదు – మా రాజన్న అని కార్యకర్తల మనసులో అభిమానాన్ని చాటుకున్న గొప్ప ప్రజనాయకుడు.అర్ధరాత్రిలో ఎవరికి ఏ ఆపదవచ్చిన కులం మతం పార్టీలు అనే బేధం లేకుండా రాజ్యాంగం కల్పించిన సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూ భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రజల మనసులో పేరొందుతున్న ఎంపిపి వై.రాజారెడ్డి సేవలు మండలస్థాయిలోనే కాకుండా జిల్లాస్థాయిలో కూడా ప్రజలకు ఉన్నతమైన సేవలను అందిచ్చుటకు అన్నివిధాల సహాయ సహకారాలు అందివ్వాలని గ్రామీణ మండలస్థాయి ప్రజల చిరకాల కోరిక. బండి కిరణ్ కుమార్ జిల్లా స్టాపర్ 9154592379

Leave A Reply

Your email address will not be published.