నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ దగ్గరికెళ్ళి చెత్త సేకరించాలని మున్సిపల్ మేనేజర్ కి వినతిపత్రం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ దగ్గరికెళ్ళి చెత్త సేకరించాలని మున్సిపల్ మేనేజర్ కి వినతిపత్రం అందజేత శనివారం నాడు నాగర్ కర్నూల్ మున్సిపల్ మేనేజర్ తో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ మరియు ప్రభుత్వ పాఠశాల దగ్గరికి చెత్త బండి ని రోజువారీగా వెళ్లాలని అన్నారు.ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకునేది పేద విద్యార్థులు కాబట్టి వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే హాస్టల్ దగ్గర ఏలాంటి చెత్త ఉండకుండా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి చెత్త బండి రోజువారీగా వెళ్లాలని అన్నారు. లేకపోతే విద్యార్థిని విద్యార్థులకు మలేరియా డెంగ్యూ వివిధ రకాల జబ్బులు వస్తాయని విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని అన్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సి హాస్పిటల్ దగ్గరికి అసలు చెత్త బండి రాదని విద్యార్థులు అంటున్నారు. కాబట్టి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిరావు పూలే, కస్తూర్బా గాంధీ వివిధ హాస్టల్ దగ్గర కూడా పారిశుద్ధ్యం లేకుండా ప్రభుత్వం చొరవతీసుకోవాలని అన్నారు మరియు పేద విద్యార్థుల ఆరోగ్యాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు అంతా కేవలం పేద విద్యార్థులు వీళ్ళ తల్లిదండ్రులు ఉపాధి రీత్యా బొంబాయి, మహారాష్ట్ర, పూణే వివిధ రాష్ట్రాలకు వెళ్లి పని చేసుకుంటారు. ఈ విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ యాదయ్య మాట్లాడుతూ అన్ని ఆస్టల్ దగ్గరికి చెత్త బండి వెళ్లేలా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మధు హుస్సేన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.