నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అడుగుతే అక్రమ అరెస్టుల ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి పులి శేఖర్

ప్యాపిలి నవంబర్ 29 (ప్రజా  నేత్ర న్యూస్) :అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ప్యాపిలి సిపిఐ కార్యాలయంలో ఒక ప్రకటన తెలపడం జరిగింది. ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి పులి శేఖర్. మాట్లాడుతూ గత పది రోజుల నుండి అకాల వర్షం కురవడం వల్ల అనంతపురం కడప తిరుపతి నెల్లూరు జిల్లాలో పూర్తిగా పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందని నిన్నటి దినమున అనంతపురం జిల్లాలో యువజన విద్యార్థి నాయకుల మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి వినతి పత్రం ఇవ్వడ ని కి వెళ్ళిన యువజన విద్యార్థి నాయకుల పై పోలీసులు అతి ఉత్సాహం చూపి విద్యార్థి యువజన నాయకులపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ పంపడం చాలా బాధాకరం అన్నారు ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసుల రాజ్యమా అని వారు తీవ్రంగా మండిపడ్డారు రైతుల పక్షాన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అడగడం కూడా నేరమా అన్నారు పోలీసులు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా వివరించాలలే తప్పా ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి అనుకూలంగా వ్యవహరించడం మంచిది కాదు ప్రజల పక్షాన పోరాటం చేసే యువజన విద్యార్థి సంఘం నాయకులను అరెస్టులతో ఉద్యమాలను ఆపాలని చూడడం మీ బ్రహ్మ అన్నారు ఇలాంటి అరెస్టులు వామపక్ష యువజన విద్యార్థి నాయకులకు కొత్త కాదని వారన్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి యువజన విద్యార్థి నాయకుల పై పెట్టిన కేసు తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మంత్రులను ఎక్కడ ఎక్కడ అడ్డుకొని తీరుతామని వారు హెచ్చరించారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.