దండారి (గుస్సాడి)ఉత్సవాల్లో బలరాం జాదవ్

ప్రజా నేత్ర న్యూస్ ఆదిలాబాద్ తేదీ:05-11-2021 ;
అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లక్ష్మిపూర్,తిమ్మాపూర్ గ్రామాలలో సంప్రదాయ బద్ధంగా దండారి (గుస్సాడి)ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఇరు గ్రామాల ప్రజల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.బలరాం జాదవ్ మాట్లాడుతు గ్రామస్తులు నిర్వహించే ఈ ఉత్సవాలు భారతదేశంలో పేరుప్రఖ్యాతులు గడించాయని అంతే కాకుండా మన ఆ ఆదిలాబాద్ జిల్లా అదివాసి బిడ్డలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెడుతున్నాయని అన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవడం వల్ల ఐక్యత పెరుగుతుందని, ప్రజలు ఆనందదాయకంగా ఉంటారని, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని వాటిని మనం కాపాడు కోవాలంటే ఇలాంటి ఆచారాలు పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారాం,ఉపసర్పంచ్ అనుమాండ్లు,పటేల్ భీమ్ రావ్,గట్టు నారాయణ,జాదవ్ భీమ్ రావ్,రాథోడ్ చంపాత్,మహేష్,రాజేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.