జాతీయ రహదారి భూసేకరణ పై వీడియో కాన్ఫరెన్స్

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 15 (సోమవారం). జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణపై సోమవారం న్యూఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బి శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంచిర్యాల హనుమకొండ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణాన్ని చేపట్టేందుకు ఇప్పటికే భూసేకరణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని త్వరగా సర్వే పూర్తి చేసి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించి భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. కాటారం సమీపంలో నిర్మాణంలో గల టోల్ గేట్ నిర్మానం పూర్తి చెయ్యాలని, సిరోంచా మహాదేవపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి అవుసరమైన భూసేకరణకు చెర్యలు చేపట్టాలని అన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో 25 కిలోమీటర్లు వెళుతుందని ఆ మూడు మండలాల్లో ఇప్పటికీ సర్వే ద్వారా 90 శాతం భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే ల్యాండ్ ఆక్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.కాటారం సమీపంలో టోల్ గేట్ నిర్మాణం వేగంగా జరుగుతుందని, సిరోంచా మహాదేవపూర్ జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ శ్రీనివాస్, కలెక్టరెట్ భూసేకరణ విభాగం సూపటింటెండెంట్ రవికిరణ్, నేషనల్ హైవే ఏఈఈ సుమిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.