గ్రామాల్లో ఫ్లోరోసిన్ సర్వే ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి వైద్య అధికారులు డా. ఇంతియాజ్ ఖాన్, నుస్రత్ యు జోహారా

ప్యాపిలి నవంబర్ 8 (ప్రజనేత్ర న్యూస్) : ప్రభుత్వ వైద్య అధికారులు ఇంతియాజ్ ఖాన్,నుస్రత్ యు జోహారా ఆదేశాల మేరకుప్యాపిలి మండలంలోని హెచ్ ఆర్ పల్లి లో ఆరోగ్య కార్య కర్త అనందు ప్లోరోసిస్ సర్వే చేసి గృహస్తుల నుంచి వారు త్రాగే నీటి నమూనాలను సేకరించి వాటిని పరీక్షా నిమిత్తం కర్నూల్ కు పంపినట్లు తెలిపారు. ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యా బోధకుడు మాట్లాడుతూ సురక్షిత మైన నీటిని త్రాగాలి, సంతులిత ఆహారం భుజించాలి. తాజా ఆకకూరలు, కూరగాయలు, పాల ఉత్పదనలు గల ఆహారం తీసుకోవడం ద్వారా ఫ్లోరోసిస్ వలన కలిగే అనర్థాలను నివారించవచ్చు,సైంధవ లవణం, వక్కపొడి, పొగాకు ఉత్పత్తులు, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడకూడదు.మనము త్రాగే నీటి లో 1 పీ పీ ఎమ్ లోపు ఉంటే ఇది సాధారణం. దీని కంటే ఎక్కువగా ఉంటే డెంటల్ ఫ్లోరోసిస్, స్కెల్ట లు , నాన్ స్కేల్ టలు ఫ్లోరోసిస్ వస్తుంది దీనిద్వారా ఎముకల నొప్పులు కాళ్ళు చేతులు వంగి పోవడము జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఫిల్టర్ నీళ్ళు త్రాగాలి అని వారు సూచించారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.