గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌ ప్రజా నేత్ర న్యూస్: కొన్ని విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని.. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు. గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలల సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. సానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను పాఠశాలల్లో తప్పనిసరిగా వాడాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.