గిరిజన వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి..

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 17 ప్రజానేత్ర న్యూస్ ; గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఆ శాఖ ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వాటిని సమర్థవంతంగా నిర్వహించి గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా అధికారులు పని చేయాలని అన్నారు. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు వసతి గృహాలు మొత్తం 12 ఉన్నాయని వాటిలో విద్యనభ్యసించే గిరిజన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్తు, త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఉన్నారు. త్రాగునీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ ల నిర్మాణం పూర్తిచేయాలని అన్నారు. ముఖ్యంగా బాలికల విద్యాసంస్థల్లో సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వాటితో పాటు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టి ప్రగతి లో గల రహదారులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ సబ్ సెంటర్లు, అంగన్వాడీ భవనాలు, డిఆర్ డిపో తదితర 28 నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఏఈలు శ్రీనివాస్, తిరుపతి, అభిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.