కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు -కల్వకుర్తి జడ్ పి టి సి పోతుగంటి భరత్ ప్రసాద్

కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామం లోని ప్రైమరీ స్కూల్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు అందుబాటులో ఉంది. పాఠశాల అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు రఘురాం గారికి , ఉపాధ్యాయులు అంజలి గారికి మరియు సర్పంచ్ పాండురంగ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ ఈ పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా లోని అన్ని పాఠశాలలు మరింత అభివృద్ధి చెందాలని భరత్ ప్రసాద్ గారు కోరారు.పాఠశాల అభివృద్ధిలో తన వంతుగా జిల్లా పరిషత్ నిధులు త్వరలోనే విడుదల చేస్తామని జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ రుకమొద్దిన్ గారు నరేష్ గ్రామస్తులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.