ఈ – ఆశా యాప్ పై అవగాహన డాక్టర్ నుస్రత్ యు జోహారా

ప్యాపిలి నవంబర్ 16 (ప్రజా  నేత్ర న్యూస్) : ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నుష్ రత్ యు జోహార జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆశా వర్కర్లకు ఈ – ఆశా యాప్ గురించి ట్రైనింగ్ ఇవ్వడము జరిగినది. యాప్ లాగిన్ అయి న తర్వాత వారికి కేటాయించిన ఇంళ్ళలో జనాభా గణన, కుటుంబ సభ్యుల సమాచారము, గర్భిణీ స్త్రీలను నమోదు చేసుకొని వారికి పరీక్షలు నిర్వహించి మతా శిశు సేవలు అందించడం . వంటి సమాచారం ఉంటుంది అని తెలపడం జరిగినది. కోవిడు టీకా 18 సంవత్సరములు పైబడి , రెండవ డోస్ వేయించు కోని వారికి అందరికీ వేయించవలెను, కోవిడు సరిఅయిన ప్రవర్తన మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ గా చేతులు శుభ్ర పరుచుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ, మలేరియా గురించి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆరోగ్య విద్యా బోధకుడు ఎల్. రాఘవేంద్ర గౌడ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయ కుమారి పర్యవేక్షకులు గంగాదేవి మనోహర్ రెడ్డి,వెంకటేశ్వర్లు ఆరోగ్య కార్య కర్త లు, ఆశా లు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.