ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబానికి అండగా ద్యాప నిఖిలన్న..

ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దశరథం(65) అనే రైతు తనకున్న పొలంలో వరి సాగు చేసుకున్నాడు.చేతికొచ్చిన పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనమని తేల్చి చెప్పడంతో, చేసిన అప్పుల బాధలు ఎక్కువయ్యి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ విషాద వార్తను జననేత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ద్యాప నిఖిలన్నకు తెలియజేసారు.ఈ విషాద వార్తను విన్న ద్యాప నిఖిలన్న కన్నీటి పర్యంతమై,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని దుయ్యబట్టారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దు పోకడ నిర్ణయాల కారణంగా నేడు ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని,నేడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరిదీక్ష కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చెంప పెట్టు అని, రైతన్నలను ఇంతలా వేధిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ఉసురు తగులుతుందని, రానున్న రోజుల్లో అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు రాజ్యం వస్తుందని తెలియజేసారు.ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతన్న కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగిరెడ్డి గారు మరియు కాంగ్రెస్ యువనాయకులు,DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.