అంగన్వాడి కేంద్రాల విలీనం తక్షణం ఉపసంహరించుకో వాలి

పర్వతగిరి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో మహబూబ్ అలీ గారికి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్ మాట్లాడుతూ ఐ సి డి యస్ యధావిధిగా కొనసాగించాలి పెంచిన పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని అంగన్ వాడి కేంద్రాలు విలీనం తక్షణమే ఆపాలని ఐసిడిఎస్ యధావిధిగా కొనసాగించాలని పెంచిన పిఆర్సి వేతనాలు వెంటనే ఇవ్వాలి, అనంతరం అంగన్వాడి పర్వతగిరి ప్రాజెక్టు అధ్యక్షురాలు బొంపల్లి రుక్మిని లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 14000 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలో కి తరలించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ అధికారులు సమావేశమై అంగన్వాడీ కేంద్రాలను విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి ఐసిడిఎస్ను యధావిధిగా కొనసాగించాలి నిరసనలు చేసినందుకు వేతనాలు కటింగ్ చేసే అప్రజాస్వామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీ ఉద్యోగులకు పెంచిన పిఆర్సి వేతనాలు తక్షణమే చెల్లించాలి, సూపర్వైజర్ సి ఎగ్జామ్స్ తేదీని ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రకటించాలి పెంచిన వేతనాలు 2018 అక్టోబర్ నుండి చెల్లించాలి బడ్జెట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మినీ అంగన్వాడీ సెంటర్లలో మెయిన్ టీచర్గా గుర్తించాలి ఈ కేంద్రాలలో ఆలయాలను నియమించాలి 2017 నుండి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు జీవో నెంబర్ 14న సవరించాలి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి జీవో నెంబర్ 19 సవరించి గ్రాట్యుటీ టీచర్లకు 3 లక్షలు హెల్పర్ లకు రెండు లక్షలు చెల్లించాలని అన్నారు రిటైర్మెంట్ అయిన వారికి చెల్లిస్తున్న వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్లపైన సరుకులు వేసే కార్గో విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అంగన్వాడి కేంద్రాల వద్దకు సరుకులు సప్లైచేయాలి రేషన్ షాప్ నుండి తెచ్చుకున్న బియ్యానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అన్నారు.నెట్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రెండింటిలో ఏదో ఒక పని మాత్రమే చేయించాలని అన్నారు. యూనిఫామ్స్ రిజిస్టర్స్ డబ్బులు చెల్లించాలని అన్నారు. ఐసిడిఎస్ సంబంధం లేని పనులు చేయకూడదు అని చనిపోయినవారికి 30000 మట్టి ఖర్చులు చెల్లించాలి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని చనిపోయినవారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే అమలు చేయాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సెంటర్ పెండింగ్ ఇన్చార్జి అలవెన్సులు వెంటనే చెల్లించాలి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు , తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.