సురారం రైతులందరికి రైతు బంధు ఇప్పిస్తాం.. జడ్పీ ఛైర్మన్లు, జిల్లా కలెక్టర్ సహకారంతో రైతులకు ధరణి పాస్ బుక్కులు ఇప్పిస్తాము. ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు…

జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 6..

తెలంగాణ రైతులకు భూసంబండ సమస్యలు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి లో సురారం రైతుల భూమిని నమోదు చేయించి అన్నదాతలందరికి రైతు బంధు, రైతు భీమా ఇప్పిస్తామని మహాదేవపూర్ ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు హామీ ఇచ్చారు. బుధవారం సురారం దేవాలయం ఆవరణ లో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఎంపీపీ రాణిబాయ్ రామారావు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో అప్పటి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సురారం, రాపల్లికోట, ముక్తిపల్లి, లక్ష్మిపూర్ శివారు లోని సర్వే నెంబర్లు ధరణి లో నమోదు కాలేదని అన్నారు. దీంతో రైతులకు రైతు భీమా, రైతు బంధు రావడం లేదని, పంట రుణాలు మంజూరు కావడం లేదని జడ్పీ ఛైర్మన్ లు పుట్ట మధు, శ్రీహర్షిణి రాకేశ్ ల దృష్టికి తీసుకువెల్లగా వారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కొరిణారని అన్నారు. జడ్పీ ఛైర్మన్ శ్రీహరిని రాకేశ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ అధిత్య ను రైతులు కలువగా రైతు సదస్సు ఏర్పాటు చేసి దరఖాస్తులు సమర్పించాలని అదేశించారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, విఆర్వో రవికుమార్, విఆర్ఏ సతిష్ లతో కలిసి రైతు సదస్సు నిర్వహించామని అన్నారు. రైతుల వద్ద దరఖాస్తులు స్వీకరించి
డీ. ఎస్. పెండింగ్ ఖాతాలను ధరణి లో నమోదు చేయిస్తామని, దీని కోసం రైతులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దని, రైతుల పక్షాన మీసేవలో ఫీజు మేమే చెల్లిస్తామని ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు స్పష్టం చేశారు. అతి త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలిసి రైతు సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. రైతు సదస్సులో ఎంపీటీసీ తిరుమల ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి, నాయకులు చల్ల రాజిరెడ్డి, చల్ల చంద్రయ్య, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ఐతరపేట రమేష్ రెడ్డి, మహేష్, కొక్కు రమేష్, గోల్కొండ కిరణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.