సర్పంచ్ చేతులమీదుగా బతుకమ్మ చీరల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని సోమారంపేట గ్రామంలో గ్రామపంచాయితీ ఆవరణంలో బతుకమ్మ చీరల పంపిణిని సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రైతుబంధు సమితి మండల అధ్యక్షులు *చేరుకుపెల్లి రాజిరెడ్డి గారు పాల్గొన్నారు. రాష్ట్రలో మహిళలు గొప్పగా జరుపుకొనే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ, ఈ పండుగ గొప్పగా జరుపుకోవడానికి అన్ని వర్గాల మహిళలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్యేశంతో రాష్ట్ర ప్రభుత్వం చీరాల పంపిణి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది, కాబట్టి ఈ చీరలను తీసుకోని బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు రాజు యాదవ్, జ్యోతి, సునీత, trs గ్రామ శాఖ అధ్యక్షులు నర్సయ్య గౌడ్, పంచాయితీ కార్యదర్శి ప్రియాంక, V.O.A లు రేవతి, ఉమారాణి, V.O వెంకవ్వ &మహిళలు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.