వ్యాక్షినేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్సలో సీ. ఎస్. సోమేశ్ కుమార్

జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 26 ; కరోనా వైరస్ మూడవ డెల్టా వేరియస్ బ్రిటన్, రష్యా, చైనా, బ్రెజిల్, ఉక్రెయిన్, బెల్జియం తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందున రాష్ట్రంలో ప్రజలందరికీ యుద్ధ ప్రాతిపదికన మొదటి, రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ న్యూడెల్టా వైరస్ వ్యాపిస్తున్నందున రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అందరికి కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో ఆశా, అంగన్వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్ పి షాప్స్ డీలర్లు, వీఆర్వో లతో కూడిన విలేజ్ లెవెల్ మల్టి డిసిప్లేనరి టీమ్ లను వెంటనే ఏర్పాటు చేసి ఆ టీంల ద్వారా ఇంటింటికి తిరిగి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకొని వారిని, 1 మొదటి డోస్, 2 వ డోస్ వేసుకొని వారిని గుర్తించి మోటివేట్ చేసి తప్పకుండా 100 % వ్యాక్సినేషన్ చెయ్యాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సహా సీనియర్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్సించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోస్ 80 %, రెండో డోస్ 70 % మందికి వేశామని, తమరి ఆదేశాలను పాటిస్తూ గ్రామస్థాయిలో విలేజ్ లెవెల్ మల్టీ డిస్ప్లేనరి టీంలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. శ్రీరామ్, జడ్పీ సీఈఓ శోభారాణి, డిపిఓ ఆశాలత, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.