రెవిన్యూ స్పందన కార్యక్రమంలో విలేజి సర్వేయర్ వేముల కృష్ణ

చాపల మడుగు పంచాయతీలోని గ్రామ రెవిన్యూ స్పందనలో విలేజి సర్వేయర్ వేముల కృష్ణ మాట్లాడుతూ ఈ స్పందన జరపడానికి ముఖ్యంగా రెవెన్యూ లో సమస్యలపై జనాలు ఇప్పటివరకు ఒంగోలు కలెక్టర్ ఆఫీసులకి వెళ్ళలిచి వచ్చేది. అక్కడికి వెళ్ళటానికి దూరప్రాంతాల వారికి చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల భూ సమస్యలను,దానిని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ సమస్యను మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియజేయగా స్పందించినటువంటి మన సీఎం ఈ సమస్యను తొందరగా పరిష్కరించే విధంగా అందరికి అందుబాటులో పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరు తమ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం నందు పరిష్కరించే విధంగా 21, 22, తేదీల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మరియు భూ సమస్యలపై ఎక్కువ అర్జీలలో ఒకరి భూమి మరొకరిపై ఆన్లైన్లో చూపించడం, , మరియు చుక్కల భూమి ఉండి ఆగిపోయిన టువంటి వాటిని భూ సమస్యను పరిష్కరించే విధంగా పెట్టినటువంటి కార్యక్రమమే రెవిన్యూ స్పందన కార్యక్రమం అని తెలియజేశారు.గ్రామ రెవిన్యూ ఆఫీసర్ చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లోని రెవెన్యూ లోపాలను పరిష్కరించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆమోదం ప్రకారం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర రావు కోరారు.
ఈ కార్యక్రమంలో చాపల మడుగు పంచాయతీ సర్పంచి సత్యనారాయణ రెడ్డి తమ్మినేని, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.