మృతుల కుటుంబాలకు అండగా సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజు
దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో29/10/2021 శుక్రవారం రోజున ఇటీవల అనారోగ్యంతో మరణించిన దూదేకుల బన్నమ్మా కు,గ్రామ సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజు లు కుటుంబ సభ్యులను పరామర్శించి,అనంతరం ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం,3000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ నేటితో 100 క్వింటాళ్ల బియ్యం,50.జతల పుస్తే మట్టెలు మరియు వివిధ గ్రామాలలో ఆర్థిక సాయం చేయడం జరిగిందని మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉందని అని వ్యక్తం చేస్తున్నాం అన్నారు.ఇక నుండి కూడా తోచిన ఆర్థిక సహాయం ఇంకా ఎలాంటి సేవలైన అందిస్తామని మా గ్రామ ప్రజల అండ దండల ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.రిపోర్టర్ విజయ్ కుమార్