మండల సమస్యల పరిష్కారం కోసం KTR కు విజ్ఞాపణ పత్రం సమర్పించిన ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు

మండల సమస్యల పరిష్కారం కోసం KTR కు విజ్ఞాపణ పత్రం సమర్పించిన ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు.

అత్యంత వెనుకబడిన దళిత గిరిజన అటవీ మండలమైన మహాదేవపూర్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి గురువారం హైదరాబాద్ తెలంగాణ భవనంలో రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు ఎంపీపీ బి.రాణిబాయ్ రామారావు వినతిపత్రం సమర్పించారు.. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ రాణిబాయ్ రామారావు తెలిపారు…
1. మండలంలోని మందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయాలి.
2. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో ముంపుకు గురైన పంట భూములకు నష్ట పరిహారం ఇవ్వాలి.
3. మండలంలోని రైతులందరి భూమిలను ధరణిలో చేర్చి రైతు బంధు, రైతు భీమా ఇప్పించాలి.
4. మహాదేవపూర్ మండల కేంద్రంలో నిరుపేదలు దళిత గిరిజనులకు 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి.
5. మండలానికి 2020-21 మరియు 2021-22 ఇసుక సినరేజ్ నిధులు విడుదల చేయాలి.
6. పాత తాలుక కేంద్రమైన మహాదేవపూర్ లో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలి.
7. మాడ.. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలి.
8. మహాదేవపూర్ లో డిగ్రీ, జూనియర్ కాలేజీల విద్యార్థుల కోసం స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలి.
9. మహాదేవపూర్ లో ముస్లిం మైనారిటీ కాలనీ నిర్మాణం కోసం ప్రత్యేకంగా 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి.
10. మహాదేవపూర్ లో గ్రంధాలయం భవన నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేయాలి.

11. మహాదేవపూర్, కాళేశ్వరం పాత్రికేయులకు నివాస స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి..
12. కాళేశ్వరం ప్రాజెక్టు కు భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి కలిపించేందుకు మహాదేవపూర్ మండలం లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి…

Leave A Reply

Your email address will not be published.