మండల వనరుల కేంద్రం భవనం(MRC) ప్రారంభించిన ఎమ్మెల్యే

జోగులంబా గద్వాల్ కె.టీ దొడ్డి మండలాన్ని అన్ని రంగాల్లో అభవృద్ధి చేస్తా మండల వనరుల కేంద్రం భవనం(MRC) ప్రారంభించిన ఎమ్మెల్యే. గద్వాల నియోజకవర్గంలో రూ.31లక్షల వ్యయంతో నిర్మించిన కె.టి దొడ్డి మండల కేంద్రంలోని నూతన మండలం వనరుల భవనాన్ని (MRC) ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అదేవిధంగా మండల గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగినది.అనంతరం ఎమ్మెల్యే గారి చేతులమీదుగా మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే గారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నోటు పుస్తకాలు ఇచ్చి సత్కరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన మండలాలను ఏర్పాటు చేసిన సందర్భంలో కేటి దొడ్డి మండలం లో కూడా నూతన మండలం గా ప్రకటించడం జరిగినది మండలంలో అన్ని ప్రభుత్వం కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అన్ని మండలాల వలె కె.టి దొడ్డి మండలం కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసి మండలంలోని మండల అభివృద్ధి చేయడం జరుగుతుంది.గత రెండు సంవత్సరాల కరోనా వైరస్ కారణం వల్ల అభివృద్ధి పనులు ఆగి పోవడం జరిగింది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు అదేవిధంగా మండలంలోని త్వరలో అన్ని కార్యక్రమాలు విద్యాలయాలు దేవాలయాలు ఏర్పాటు చేసి జిల్లాలోని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామని అని పేర్కొన్నారు.త్వరలోని గట్టు ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.కరోనా వ్యాక్సిన్లు మండలం పై ప్రజల అవగాహన కల్పించాలి గ్రామాల్లోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు వైద్యాధికారులు సమన్వయంతో గ్రామంలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేసి కరోనా రహిత మండలం మార్చాలని తెలిపారు.భవిష్యత్తులో మండల అభివృద్ధి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ్మ , జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సర్పంచ్ పావని, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి, డైరెక్టర్స్ తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, చక్రధరరావు, జంబు రామన్ గౌడ్, రాజేష్, యుగేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, శ్రీధర్, రంగారెడ్డి, వంశీ, నవీన్, కురుమన్న, అమరేష్, యూత్ అధ్యక్షుడు నక్క శేఖర్ రెడ్డి, సభ్యులు వీరేష్,కాశీం, సుధాకర్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.