మండల కేంద్రంలో జరిగే నిరసనలు జయప్రదం చేయండి – యుటిఎఫ్

ప్యాపిలి అక్టోబర్ 6 (ప్రజనేత్ర న్యూస్):
ఉపాధ్యాయుల బోధనకు తీవ్ర ఆటంకం కలిగిస్తూ బోధన సమయాన్ని హరించి వేస్తున్న పలు రకాల యాప్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారని అక్టోబర్ 7 వ తేదీన రెండవ దశలో భాగంగా ప్యాపిలి మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిరసనలు చేపట్టబోతున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొదటి దశలో భాగంగా మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారని రెండవ దశలో భాగంగా రేపు సాయంత్రం ప్యాపిలి మండల విద్యాధికారి కార్యాలయం వద్ద నిరసనలు చేస్తున్నామని తెలిపారు.
విద్యా శాఖ అధికారుల వింత పోకడల వల్ల యాప్ లు ఎక్కువ అయ్యాయని యాప్ లలో వివరాలు పంపడానికి ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు చరవాణితో కుస్తీ పడుతున్నారని ఇంక బోధనకు సమయం ఎక్కడ ఉందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.మూడవ రోజు నిరసనల కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని జక్కసానికుంట్ల,  పోతుదొడ్డి,ప్యాపిలి,గార్లదిన్నె,పెద్ద పోదిళ్ల, వెంగాళ్ళం పల్లి,ఓబుల దేవర పల్లి, తదితర పాఠశాలలలో ఉపాధ్యాయులు సుధాకర్,హేమలత,లతీఫ్,మౌలాలి,శాంతి ప్రియ,చౌడమ్మ,వాసవి,
విజయ భాస్కర్,రుక్మిణి,విజయ్ కుమార్,లక్ష్మి,మహబూబ్ బాషా,లలిత,శ్రీను,రాజేంద్ర,హరి శంకర్,రాజన్న తదితరులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.