బోధనకు ఆటంకం కలిగించే యాప్ లను రద్దు చేయాలి-యుటిఎఫ్

ప్యాపిలి అక్టోబర్ 6 (ప్రజనేత్ర న్యూస్):
పాఠశాలల్లో భోదనా సమయాన్ని హరించి వేస్తున్న యాప్ లను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి తీసుకొని వచ్చేలా మరియు గుదిబండగా మారిన వివిధ రకాల యాప్ లను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.దీనివల్ల ఉపాధ్యాయుల బోధన సమయం యాప్ లలో వివరాలు అప్లోడ్ చేయడానికి సరిపోతుందని ఇక బోధనకు సమయం ఎక్కడ ఉందో తెలపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వారు మాట్లాడుతూ
యాప్ లను రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇందుకు గాను యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ మూడు దశల పోరాటాన్ని నిర్వహిస్తున్నదని మొదటి దశలో భాగంగా గత మూడు రోజులుగా అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అయ్యారని,
రెండవ దశలో అక్టోబర్ 7 వ తేదీన మండల విద్యా వనరుల కేంద్రాలను,మూడవ దశలో అక్టోబర్ 19 వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.అధికారంలోకి వచ్చిన తర్వాత యాప్ ల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత యాప్ లసంఖ్య తగ్గడంకాదు కదా గతంలో కంటే రెట్టింపు అయ్యాయని ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.కరోనా సమయంలో విద్యకు దూరమైన విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠశాలకు వస్తున్నారు కరోనా సమయంలో కోల్పోయిన విద్యను అందించవలసిన బాధ్యత మనందరిపైన వుంది కాని పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యాప్ లతో కుస్తీ పట్టడానికే సరిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాప్ లను కుదించాలని లేని పక్షంలో యాప్ లను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు లక్షమేశ్వరమ్మ పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.