బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ భవేశ్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 24

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బ్రవేశ్ మిశ్రా. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఎ ఉట్నూర్ గా విధులు నిర్వహిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వంచే నియమించబడిన బ్రవేశ్ మిశ్రా ఆదివారం ఉదయం భూపాలపల్లిలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, సూపరింటిండెంట్ రవికుమార్, సెక్షన్ అధికారులు సునీల్, జలపతి రెడ్డి, భూపాలపల్లి, ఘనపూర్ తహసీల్దార్లు ఇక్బాల్, సతీష్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా పౌరసంబంధాల అధికారి రవికుమార్ లు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, భూసేకరణ, లా అండ్ ఆర్డర్, ప్రజావాణి కార్యక్రమం, ధరణి తదితర అంశాలపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.