ప్రశాంతంగా మొదటి రోజు ప్రథమ సం. పరీక్ష

కుమురం భీంఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో 25వ తేదీన నిర్వహించబడిన ఇంటర్మీడియేట్ ప్రథమ సం. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు షెడ్యూల్ ప్రకారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒకేషనల్ జీఎఫ్ సీ సబ్జెక్టులకు గాను పరీక్ష నిర్వహించబడింది. జనరల్ విద్యార్థులు 4326 మరియు 882 ఒకేషనల్ మొత్తం 5208 విద్యార్థులుండగా మొదటి రోజు 457 విద్యార్థులు గైరహాజరయ్యారు, 4751 విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 24 కేంద్రాల్లో కోవిడ్ నిబంధనల మేరకు మాస్కు ధరించడం, సానిటైజర్ వాడకాన్ని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ, విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలిస్తూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పలు పరీక్షా కేంద్రాల్లో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్,తిరుపతి,1 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మరియు 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు గా పరిశీలించారు. సంబంధిత రిపోర్టులు ఇంటర్ బోర్డుకు పంపించారు.

Leave A Reply

Your email address will not be published.