నూతన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం

ప్యాపిలి అక్టోబర్ 26 (ప్రజా నేత్ర న్యూస్): ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో
నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్ గువ్వల నాగరాజు వైస్ చైర్మన్ బై నేని అనసూయ వీరిని ప్యాపిలి మండల కో ఆప్షన్ మెంబర్ జలదుర్గం రసూల్, సర్పంచ్ దస్తగిరి, మైనారిటీ చైర్మన్ జమాల్ సాహెబ్ వైసిపి నాయకులు గంగిరెడ్డి, రంజాన్, డీలర్ బషీర్, హుస్సేన్ వలి, జలదుర్గం ప్రాథమిక పాఠశాల యందు ఘనంగా సన్మానించి అనంతరం వారికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ మెంబర్ రసూల్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.