తెరాస పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఉత్తనూరు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మేళ

జోగులంబా గద్వాల జిల్లాఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో తెరాస పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ ఉత్తనూరు తిరుమల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథి లుగా హాజరై ప్రారంభించిన అలంపూర్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వి.యం.అబ్రహం ,ఎమ్మెల్సీ శ్రీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పక్షపాతి గౌరవ సీఎం శ్రీ కెసిఆర్ గారని..రైతులకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని.. రైతు బంధు,రైతు భీమా,రైతులకు 24 గంటల కరెంటు.. అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే విధంగా రైతులకు చివరి ఆయకట్టు వరకు కుడా నిరందిస్తున్నామని తెలిపారు.. వ్యవసాయం, ఉద్యానశాఖ,పశు సంవర్ధక వివిధ కంపెనీ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించి రైతులకు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తున్నారో తెలుసుకోవడం జరిగింది..రాష్ట్రంలో ఆధునూతన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు అవగాహనా కల్పిస్తున్న గౌరవ ఉత్తనూరు తిరుమల్ రెడ్డి గారి బృందాన్ని ఎమ్మెల్యే అభినందించడం జరిగింది..అనంతరం..ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జెడ్పీటీసీలు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీ లు,PACS ఛైర్మన్లు, వైస్ చైర్మన్ లు మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు,మాజీ ఎంపీపీ లు,సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..టీ. రాజు రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.