తనయుడు అంజి ని తల్లి తండ్రులకు అప్పగించిన యస్ ఐ సీ. ఎం. రాకేష్

ప్యాపిలి ఏమి కష్టం వచ్చిందో ఏమో. 15 సంవత్సరముల వయసున్న, హిందూపురం పట్టణానికి చెందిన అంజి తన తల్లి తండ్రులకి చెప్పకుండా ఇంటి నుండి పారిపోయి ప్యాపిలి పట్టణం చేరాడు. ప్యాపిలి పట్టణ బస్ స్టాండ్ యందు తిరుగుచున్నట్లు అందిన సమాచారం మేరకు యస్ ఐ సీఎం రాకేష్ గారికి విషయం తెలిసి, పోలీస్ స్టేషన్ కి అబ్బాయిని పిలిపించి తన వివరాలు తెలుసుకున్నారు.యస్ ఐ హిందూపురం లోని తన తల్లి తండ్రులకి సమాచారం అందించి, వారిని ప్యాపికి స్టేషన్ కి పిలిపించి తన తండ్రి నారాయణకు అప్పగించారు. తమ బిడ్డ సమాచారం అందించి తమకు అప్పగించినందుకు ఎస్ ఐ రాకేష్ గారికి అంజి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.